నమిండ్ల రవీందర్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.

55వ డివిజన్ బీఆర్ఎస్ కమిటీ సంతాపం.

నమిండ్ల రవీందర్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు.

హాసన్ పర్తి, అక్టోబర్ 12(తెలంగాణ ముచ్చట్లు):

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్ కోమటిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల కార్యకర్త,డివిజన్ ఎస్‌సీ విభాగ అధ్యక్షుడు,తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు నమిండ్ల రవీందర్ గుండెపోటుతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు.
నమిండ్ల రవీందర్  మరణ వార్తతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్థివదేహానికి 55వ డివిజన్ బీఆర్ఎస్ కమిటీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అటికం రవీందర్ గౌడ్,హన్మకొండ జిల్లా మాజీ రైతు సమన్వయ సమితి కన్వీనర్ సంగాల విక్టరీ బాబు మాట్లాడుతూ నమిండ్ల రవీందర్  పార్టీ కోసం అపారమైన సేవలు చేశారని ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. 
 పార్టీ పరంగా అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేస్తూ భవిష్యత్తులో ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అలాగే, రవీందర్  సేవలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లి, పార్టీ తరఫున కూడా కుటుంబానికి సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో భీమారం గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి నాతి సమ్మయ్య, డివిజన్ యూత్ అధ్యక్షుడు గుంజే సాయి కుమార్, సీనియర్ నాయకులు పొరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పోగుల రమేష్,బూర రామకృష్ణ,నమిండ్ల రవీందర్, పల్లపు రవికుమార్,అటికం శివరాం,కొండేటి హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .