స్టేషన్ ఘనపూర్‌లో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

స్టేషన్ ఘనపూర్‌లో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు:

జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని స్టేషన్ ఘనపూర్ మార్కెట్‌లో రైతులను ఘనంగా సన్మానించారు. మార్కెట్ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ట్రేడర్లు, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ తరపున రైతులకు మిఠాయిలు పంచి, వారి సేవలను ప్రశంసిస్తూ ప్రత్యేక సన్మానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు అన్నదాతల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతుల పట్ల నిబద్ధతతో పనిచేస్తామన్నారు.

వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, తమ సమస్యలను వెల్లడించారు. రైతుల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని వారు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .