జయగిరిలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు.
Views: 12
On
హాసన్ పర్తి,అక్టోబర్ 03(తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని జయగిరి గ్రామంలో దుర్గామాత అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.గ్రామస్థుల సారధ్యంలో పది రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో మహిళలు, యువత, చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ప్రతిరోజూప్రత్యేకపూజలు,అలంకారాలు,కుంకుమార్చనలు,సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. చివరి రోజు అమ్మవారికి మహాపూజలు నిర్వహించగా, అనంతరం శోభాయాత్రతో ఉత్సవాలు ముగిశాయి.స్థానిక నాయకులు,పెద్దలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని దేవీ కృపకు పునీతులయ్యారు.గ్రామ ప్రజలు ఇలాంటి కార్యక్రమాలు సాంప్రదాయాన్ని కొనసాగించేలా ప్రోత్సాహం ఇస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments