జడ్పీటీసీ బరిలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు బాధావత్ సైదులు నాయక్..

రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి అనుచరుడుగా మండల వ్యాప్తంగా ప్రత్యేక పేరుగాంచిన సైదులు..

జడ్పీటీసీ బరిలో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు బాధావత్ సైదులు నాయక్..

 ఎస్టీ సామాజిక వర్గంలో బలమైన నేతగా మండలంలో ప్రత్యేక గుర్తింపు..

 ఖమ్మం బ్యూరో,అక్టోబర్ 6, తెలంగాణ ముచ్చట్లు;

కొనిజర్ల జడ్పీటీసీ ఎన్నికల బరిలో మండలంలోని ఉప్పల్ చెలక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కొనిజర్ల మండల మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ కిసాన్ కేత్ జిల్లా కార్యదర్శి,  ఉప్పలచెలక మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాదావత్ సైదులు నాయక్ ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యులు రేణుకాచౌదరికి ప్రధాన అనుచరుడుగా ఉండటంతో పాటు 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన నేతగా ప్రత్యేక గుర్తింపు ఆయన సొంతం. రేణుక చౌదరితోపాటు ఖమ్మం జిల్లాలో  ఉన్న ముగ్గురు మంత్రులతో ఆయన తలలో నాలుకల ఉంటాడు. కొనిజర్ల మండల వ్యాప్తంగా సైదులు అంటే తెలియని వారు ఉండరు. అదేవిధంగా లంబాడి సేవా సమితి జిల్లా అధ్యక్షులుగా తమ సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన నాయకుడు. ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పిటిసి ఎస్టీకి రిజర్వుడు కావడంతో ఆయన బరిలోకి దిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కొనిజర్ల మండలంలోని ఉప్పల్ చెలక గ్రామానికి చెందిన ఆయన  గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. పాలనపరంగా ఆయనకు ప్రజల్లో మంచి పట్టు ఉండటంతో పాటు అన్ని విషయాలపై మంచి అవగాహన  కలిగిన నాయకుడిగా మృదు స్వభావిగా పేరుపొందారు.  కొనిజర్ల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలకు ఆయన సుపరిచితులు. అదేవిధంగా కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నాయకులతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉండటంతో ఆయన బరిలో ఉంటే  ప్రత్యార్థులకు దీటుగా సవాలు విసిరే అవకాశం ఉందని మండలంలో జోరుగా చర్చ జరుగుతుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన సైదులు నాయక్ లాంటి నేతకు జడ్పిటిసి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుపొంది అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్దలతో టికెట్ తెచ్చుకొని  బరిలో ఉంటే గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుందని మండలంలో చర్చ కొనసాగుతుంది. చివరికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జడ్పిటిసి టికెట్ ఎవరికి ఇస్తుందో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే .

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .