జమాఅతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో నైబర్స్ రైట్స్ క్యాంపెయిన్
ఖమ్మం బ్యూరో, నవంబర్ 11, తెలంగాణ ముచ్చట్లు;
ఆదివారం ఖమ్మం పట్టణంలో అజీజ్ సందులో గల జమాఅతె ఇస్లామీ హింద్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా అధ్యక్షతన జరిగిన సభ్యుల మరియు కార్యకర్తల సమావేశం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న జమాఅతె ఇస్లామీ హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాదిక్ అహ్మద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నవంబర్ 21-30 వరకు నైబర్స్ రైట్స్ క్యాంపెయిన్ (పొరుగు వారి హక్కులు) నిర్వహిస్తుందన్నారు ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి కార్యకర్త పొరుగువారి హక్కుల గురించి అవగాహన పెంచుకోవాలి. పొరుగువారు ఒకరితో ఒకరు సంబంధాలను చక్కదిద్దుకోవడానికి మరియు స్నేహపూర్వక మరియు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలి, వీధిలో, షాపింగ్ కేంద్రాలలో, ప్రయాణిస్తున్నప్పుడు మరియు వర్చువల్ ప్రపంచంలో పొరుగువారి గురించి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ ఉద్యమంలో పురుషులు మరియు మహిళ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. జమాఅతె ఇస్లామి హింద్ నార్త్ అధ్యక్షులు మొహమ్మద్ యూసుఫ్ షరీఫ్, సౌత్ అధ్యక్షులు సయ్యద్ నిజాముద్దీన్, వెస్ట్ అధ్యక్షులు అబ్దుస్ సుబుర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు అస్మా అన్జుమ్,సెంట్రల్ అధ్యక్షురాలు అస్ఫీయ అన్జుమ్, నార్త్ అధ్యక్షురాలు హుస్సేన్ బి ,సౌత్ అధ్యక్షురాలు నాజియా తబస్సుం ,వెస్ట్ అధ్యక్షురాలు ఫర్జానా సభ్యులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Comments