న్యూ హిల్ పాఠశాల ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
కుషాయిగూడ, అక్టోబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ సాయి నగర్ కాలనీ లో న్యూ హిల్ ఇంటిగ్రల్ పాఠశాల ప్రారంభోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. విద్యా రంగంలో కొత్త దిశను సృష్టించే ప్రయత్నంగా ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల భవనాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఏ.ఎస్. రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ దానపాల్ రెడ్డి, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.నిర్వాహకులు మాట్లాడుతూ—“విద్యార్థుల్లో విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యతా భావం పెంపొందించడం మా ప్రధాన లక్ష్యం. ఆధునిక బోధనా పద్ధతులు, విస్తృత తరగతి గదులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యతతో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల దోహదపడుతుంది” అన్నారు.


Comments