"పిల్లలు కాదు- పిశాచాలు
"భౌషత్ కాలానికి తలనొప్పులు"
"పిల్లలు కాదు- పిశాచాలు"
"భౌషత్ కాలానికి తలనొప్పులు"
"తల్లి దండ్రులకు శాపగ్రస్తులు"
సామాజిక వేత్త లోడిగ వెంకన్నయాదవ
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 24, తెలంగాణ ముచ్చట్లు;
'పిల్లలు కాదు పిడుగులు' అని పెద్ధలు ముచ్ఛటగా అలనాటి సామెత మాట. కాని ఈ నాటి పిల్లలు పదోతరగతి పూర్తి చేసిన నాటినుండి వాడు జీవితం లో సెటిల్ అయ్యేవరకు కొందరు పిల్లలు తల్లిదండ్రులకు పిడుగులు కాదు పిచాచులుగా తయ్యారు అవుతున్నారు. సమాజానికి, కన్నతల్లిదండ్రులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అటు సామాజంలో ఇటు కుటుంబం లో కునుకు లేకుండా చేస్తున్నారు. పిల్లల పెంపకం తో పనిలేకుండా చిన్న నాటినుండి నేర ప్రవృత్తి తో పెరుగుతున్నారు చుట్టూఉన్న వారి పరిసరాల ప్రభావం , స్వేచ్చగా జీవించే వెసులు బాటు, భౌషత్ అవసరాలకు సరిపడా ఆర్థిక వెసులుబాటు కుటుంబానికి కలిగి ఉండటం ఇదిఅవసరం అని తెలిసేలోపే పిల్లలకు తల్లిదండ్రులు సర్దుబాటు చేయడం వలన పిల్లలకు తన అవసరం ఏమిటో తెలియకుండా పోతుంది. పిల్లలను తీక్షణంగా గమనిస్తే తప్ప వారు తప్పటడుగులు వేస్తున్నారు అనే విషయం గమనించ లేనంతగా ఉంటున్నారు. ఎవరి స్థాయిలో వారికి చెడిపోవడానికి ఆ కుటుంబ వెసులుబాటు లేదా అవసరానికి సమకూర్చగలిగిన స్తోమత,వారికి కావలిన సాదనాలు అవసరం లేక పోయినా బండి,సెల్లు,కారు, డబ్బు, విలాసవంతమైన ఇల్లు, పల్లేల్లో రాజకీయ నేపథ్యంతో కూడిన వాతావరణం ఇలా ఒకటి అనికాదు తొందరగా చెడిపోవడానికి కావలసిన ప్రతీఒక్కసాదనాలు అందుబాటులో ఉంటున్నాయి .ఇది చేయవచ్చు చేయకూడదు అని ఆలోచన శక్తి లేకుండా స్నేహం ఇంటర్ నెట్, హర్రర్ చిత్రాలు, యూటూబ్ లో ఎక్కువ సమయం పలుకారణాలు వారికి దగ్గర గా ఉన్నాయి వాటితో గడపటానికి ఎక్కువ ఇష్టపడతారు. ఉమ్మడి కుటుంబాలు గా లేకపోవడం, అడిగిందే తడువుగా తల్లిదండ్రులు ఇవ్వడం ఆహార అలవాట్లు,చిరుతిండ్లకు అలవాటు పడటం ఒకటి కి ఇంకొకటి తోడుగా పిల్లల ఆలోచనలు రూపాంతరం చెందుతున్నాయి. మత్తుపానీయాలు, గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలు సైతం తల్లి దండ్రుల కంటపడకుండా అలవాటు చేసుకొని ఆమైకంలో తప్పులు చేసి తల్లిదండ్రులకు తలనొప్పులు తెచ్ఛి కుటుంబం వీదిన పడేలా చేస్తున్నారు. జీవితంలో స్థిరపడటానికి కావాలిసిన మార్గాలకంటే విలాసవంతమైన జీవితం,ఇదే ప్రపంచం అని భ్రమించి ఇటు సమాజాన్ని అటుకుటుంబాని మతి బ్రమించేలా చేస్తున్నారు. క్రిమినల్ మైండ్ తో అనునిత్యం నేరపూరితమైన జీవితంలో మునిగి పోతున్నారు. జీవితం గురించి కుటుంబం గురించి ఆలోచన లేకుండా మూడు పదుల వయస్సు దాటుతున్నా ఉద్యోగం, పెండ్లి, సోసైటి కుటుంబ భాద్యత మరిచి ముప్పేట మూడుపూటలు తిని కన్న తల్లి దండ్రులకు భారంగా మారుతున్నారు. కన్ననేరానికి భరించక తప్పదు అన్నట్టుగా తల్లి దండ్రులకు శాపగ్రస్తులు గా కొందరు యువత సమాజానికి, కుటుంబానికి భారంగా తయ్యారు అవుతున్నారు. కొందరికి ఆకలి, అవసరం అనేది లేకుండా తిరుగుతున్నారు. చేసి బ్రతుకటానికి ఉద్యోగం ఒక్కటే మార్గం కాదు..వళ్ళువంచి పనిచేస్తే పలు మార్గాలు యువత కాళ్ళదగ్గరకు వస్తాయి. కాని పనిచేసి బ్రతికే అవసరం లేకుండా పోతుంది ఈ నాటి కొందరి యువతకుఆర్థికంగా వెసులుబాటు కలిగి ఉండటం, మధ్యతరగతి చిన్నకుటుంబాలకు ప్రభుత్వం సంక్షేమ నిత్యఅవసర వస్తువులు, పింఛను, వ్యవసాయ,కార్మికుల జీవనోపాధి పథకాలు, ఆర్థిక వెసులుబాటు కొరకు ఓట్ల భయంతో రాజకీయ నాయకులు అందిస్తున్న తాయిలాలు ప్రభుత్వ స్కీముల రూపంలో పనిచేయకుండా యూవత సోమరితనాన్ని పెంచే ప్రభుత్వ పథకాలు రేపటి కోరకు తిండి లేదు అనే భయం ఈనాటి యువతకు ప్రభుత్వం అందిస్తున్న కిలో రూపాయి సన్నబియ్యం,ఉప్పు పప్పు చింతపండు పంచదార సబ్బులు కూడా ప్రభుత్వ రేషన్ షాపులో దొరుకుతాయి. గ్రామంలో ఉన్న జనాభాకంటే కుటుంబ రేషన్ కార్డ్ లు ఎక్కువ గా ఉన్నాయి. యువతకు ఉపాధి కల్పించే పథకాలు రచించకుండా ఉచితంగా ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. చిన్నతనంలో నే డ్రగ్స్ కు అలవాటు పడకుండా ,మత్తుపదార్ధాల కు దూరంగా ఉండే కటినంగా వ్యవహరించే చట్టాలు, అరికట్టే వ్యవస్థ ఇప్పుడు ఎంతో అవసరం.అతరహలో ప్రభుత్వం ఆలోచన చేయకపొతే చెతికి వచ్ఛి న యువత చేజారిపోతుంది. అటుసమాజానికి ఇటు కుటుంబానికి యువత భారంగా మారేరోజు వస్తుంది. యువత పెడదారి పట్టకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి..యువత తస్మాత్ జాగ్రత్త


Comments