ఎన్ఎస్ టి రోడ్ నిర్వాసితులకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలి ..
వై విక్రమ్
ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి సరితా క్లీనిక్ సెంటర్ వరుకు ప్రధాన రహదారిపై గత 40 సంవత్సరాలుగా వున్న షాప్ లను తొలగించడానికి ముందు వారికి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాలని సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్ ఎస్ టి రోడ్ నిర్వాసితులు సిపిఎం పార్టీ ఖమ్మం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ మేనేజర్ కిషోర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వై విక్రమ్ మాట్లాడుతూ ఖమ్మం నగరం రోజు రోజుకు విస్తరణ పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ బాగా పెరిగింది అని, వాహనాలు పెరుగుతున్న ఈ సమయంలో రహదారులు విస్తరణ అవసరం కూడా వుంది అని, అలాగే రోడ్లు విస్తరణ జరిగే ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాలుగా అప్పటి వరకూ వున్న భూ నిర్వాసితులకు కూడా ప్రభుత్వం తగిన నష్టపరిహారం తో పాటు, వారికి స్థలాలు చూపించాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ టు సరితా క్లీనిక్ సెంటర్ రోడ్ పక్కన గత 40 సంవత్సరాలుగా వివిధ చిన్న చిన్న షాపులు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు అని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వారికి ప్రత్యామ్నాయంగా స్థలాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు టి విష్ణు, పార్టీ టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, నాయకులు ఎస్ కె హుస్సేన్, సుభాష్, మల్లికార్జున్ రెడ్డి, శివా తదితరులు పాల్గొన్నారు


Comments