ఈ నెల 13న నర్సంపేటలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష
నర్సంపేట,నవంబర్11(తెలంగాణ ముచ్చట్లు):
బీసీ జేఏసీ రాష్ట్ర పిలుపు మేరకు బీసీల హక్కుల సాధన కోసం నర్సంపేటలో ఈ నెల 13న ధర్మ పోరాట దీక్ష నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు, నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్, బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం రాజ్యాంగ సవరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఆదేశాల ప్రకారం అష్టాంగ ఆందోళనల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బీసీలు దీక్షలు చేపట్టనున్నారని వివరించారు.
నర్సంపేటలో ఏమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రహరీ గోడ ముందు జరిగే ఈ ధర్మ పోరాట దీక్షలో నియోజకవర్గంలోని అఖిలపక్ష నాయకులు, బీసీ జేఏసీ నేతలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా, ఉద్యోగ సంఘాలు పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు, జేఏసీ వైస్ చైర్మన్ కడారి సురేష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నూరి రవి ముదిరాజ్, జిల్లా అధికార ప్రతినిధి మరుపల వీరస్వామి కురుమ, చెన్నారావుపేట మండల అధ్యక్షుడు బర్ల యాకయ్య, పట్టణ కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, బీసీ నాయకులు మేరుగు శంకర్, లింగం గుండు బాబ్జీ, కొలిపాక సుధాకర్, శీరంశెట్టి రాజేందర్, పెరక మద్దెల కొమురయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Comments