ఒకపక్క కలకల...మరోపక్క వెలవెల..
వృధాగా పోతున్న వర్షపు నీరు
వనపర్తి, ఆగస్టు18 (తెలంగాణ ముచ్చట్లు):
దేవుడు కరుణించిన పూజారి వరమీయనట్లుగా పెద్దమందడి మండలం అమ్మపల్లి తిమ్మరాయి చెరువు, అమ్మ చెరువు రైతుల పాలిట శాపంగా మారింది, చెరువులు చిన్నపాటి మరమ్మతులకు నోచుకోకపోవడంతో చెరువులోకి వచ్చిన వర్షపు నీరు తుమ్మల నుండి వృధాగా పోతున్నాడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, దేవుడు కరుణించిన పూజారి వరమియ్యనట్లుగా మా పాలిట శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఓ పక్క చెరువు నుండి రైతులు పంటలు చేసుకు సాగు చేసుకుంటే, తిమ్మరాయి చెరువులోకి నీళ్లు వచ్చి చెరువు ఖాళీ కావడంతో సాగు భూములు ఎడారిగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మూగజీవాలకు సైతం తాగునీటి ఎద్దటి ఏర్పడుతుందని ఆందోళన చేస్తున్నారు, అదేవిధంగా అమ్మ చెరువు తూము నుండి నీరు పోకుండా మట్టితో మూసేశారు, దీంతో పంటలు సాగు చేసుకోవడానికి సాగునీరు రాని పరిస్థితి ఏర్పడ్డది,అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవడంలో నిర్లక్ష్యంగా వివరించడంతో మా పాలిట శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,


Comments