పంచాయతీ ఎన్నికలపై గ్రామాల్లో కొనసాగుతున్న చర్చలు

పంచాయతీ ఎన్నికలపై గ్రామాల్లో కొనసాగుతున్న చర్చలు

 • *పంచాయతీ ఎన్నికలపై యువత ఆసక్తి*   

• *వెల్టూర్ లో పెరుగుతున్న ఆశావాహులు*

వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు

పెద్దమందడి మండలం వెల్టుర్ గ్రామంలో రాజకీయ నాయకులు, యువత ప్రజాసేవపై ఆసక్తి ఉన్న వారి దృష్టి పంచాయతీ ఎన్నికలపై పడింది. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎలాగైనా సర్పంచి పదవి దక్కించుకోవాలని ఆశతో ఆశావాహులు ఉన్నట్టు తెలుస్తుంది. పెద్దమందడి మండలంలో అతిపెద్ద మేజర్ గ్రామపంచాయతీ వెల్టూర్ గ్రామం కావడంతో ముఖ్యంగా గ్రామంలో ఈ పంచాయతీ ఎన్నికలపై యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రామంలో ఎవరికి వారు సర్పంచ్ గా నిలబడాలని అనుకుంటున్నారు. పెద్ద గ్రామ పంచాయతీ కావడంతో ఆశావాహులు కూడా అదే స్థాయిలో ఉన్నారు. దాదాపు 15-20 మంది ఆశావాహులు ఉన్నట్లు గ్రామస్తులు అనుకుంటున్నారు. కొందరు యువకులు లక్షలు ఖర్చయినా పర్వాలేదు సర్పంచిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని గ్రామంలో చర్చించుకుంటున్నారు. కానీ గ్రామంలోని ప్రజలు మాత్రం ఎవరికీ పట్టం కడతారో ఆసక్తికరంగా మారింది. గతంలో మాదిరిగా గ్రామంలో ఏకీగ్రీవం కాకుండా ఎన్నికల నిర్వహించాలని మెజారిటీ గ్రామస్తులు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బ్రోకరిజం, ఇసుక మాఫియా, పంచాయతీ సెటిల్మెంట్ చేస్తూ లబ్ధి పొందే వారు కాకుండా... గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే వారికి అవకాశం కల్పించాలని చూస్తున్నారు. మరోపక్క యువత వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలికి ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతుందా లేదా అని ఆసక్తికరంగా మారింది. గ్రామంలో సర్పంచ్ పదవికి చాలా కాలంగా ఎస్సీలకు రిజర్వేషన్ రాకపోవడంతో ఎస్సీలు ఈసారి తప్పకుండా రిజర్వేషన్ మాకె వస్తుందని ఆశిస్తున్నారు. ఎస్సీలకు గనుక రిజర్వేషన్ వస్తే సర్పంచ్ పదవికి పోటీ చేసి తమదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. ఏది ఏమైనా గ్రామంలో రిజర్వేషన్ ఎవరికి వస్తుందని ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాలు అన్నిటిని యువత క్షుణంగా పరిశీలిస్తూ తప్పకుండా ఈసారి యువత ముందుంటుందని చెప్పకనే చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామంలో రాజకీయ వాతావరణం కనపడుతుంది. గ్రామంలో గతంలో సర్పంచ్ గా కొనసాగిన వారిని మరోసారి గెలిపించుకునేందుకు గ్రామ ప్రజలు ఆసక్తిగా లేనట్టు తెలుస్తుంది. వెల్టూర్ గ్రామంలో ఈసారి సర్పంచ్ పదవి ఎవరికి దక్కుతుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .