డీసీసీ అధ్యక్ష పదవిపై సత్తుపల్లిలో అభిప్రాయ సేకరణ.
సత్తుపల్లి, అక్టోబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడి నియామకాన్ని దృష్టిలో ఉంచుకొని సత్తుపల్లి నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ కార్యక్రమం గురువారం జరిగింది.
సత్తుపల్లి పట్టణంలోని ఎం.ఆర్. గార్డెన్స్‌లో జరిగిన ఈ సమావేశానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పరిశీలకుడు మహేంద్రన్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా డీసీసీ పదవికి పోటీ చేయాలనుకున్న ఆశావహుల నుండి దరఖాస్తులు స్వీకరించడమే కాకుండా, సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నుండి వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించారు.
కార్యక్రమంలో సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, యువ నాయకుడు తుమ్మల యుగంధర్, సత్తుపల్లి ఇంచార్జ్ చక్కిళం రాజేశ్వర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువల్ల దుర్గా ప్రసాద్, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ, ఐదు మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, యువ కాంగ్రెస్ విద్యార్థి విభాగం, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్టీ బలపర్చడం, గ్రామ స్థాయిలో క్రమబద్ధంగా కార్యకర్తల శ్రేణిని చురుకుగా మార్చడంపై పలువురు నేతలు సూచనలు చేశారు.
డీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించిన చర్చలు వేడెక్కిన ఈ సమావేశం పార్టీ వర్గాల్లో ఉత్సాహం నింపిందని స్థానిక నేతలు తెలిపారు.


Comments