శ్రీకాంత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పరమేశ్వర్ రెడ్డి
దుఃఖంలో కుటుంబ సభ్యులకు ఓదార్పు
-ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ
-కాంగ్రెస్ నేతలతో కలిసి పరామర్శ
-వ్యక్తిగత సహాయం అందిస్తానని భరోసా
ఉప్పల్,ఆగస్టు19(తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి శోభాయాత్రలో జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీకాంత్ రెడ్డి కుటుంబాన్ని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పరామర్శించారు.
మంగళవారం ఆయనతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంది ఆగి రెడ్డి, ఆకారపు అరుణ్, కంది శ్రవణ్ రెడ్డి, లుకాస్, సందీప్, భాస్కర్ తదితరులు కలిసి రామంతాపూర్ శారదా నగర్‌లోని అంజిరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. వ్యక్తిగతంగా తాను ఎల్లప్పుడూ సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.


Comments