గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలి

పెద్దమందడి తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం 

గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలి

వనపర్తి ,తెలంగాణ ముచ్చట్లు:

పెద్దమందడి మండలంలోని వివిధ గ్రామాల గ్రామపంచాయతీ కార్మికులకు గత  మూడు, నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం పెద్దమందడి తాసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐ గణేష్ కు పలు డిమాండ్లతో, పెండింగ్ జీతాలను చెల్లించాలని గ్రామపంచాయతీ కార్మికులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికుల మండల అధ్యక్షులు గట్టమ్మ మరియు మాజీద్ మాట్లాడుతూ... గత మూడు నాలుగు నెలలుగా గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించడం లేదని పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని అన్నారు. జీతాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని కోరారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం ముందు మోకాళ్ళతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 23 గ్రామపంచాయతీల కార్మికులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .