దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని ఆకాంక్ష

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో బాగుండాలని ఆకాంక్ష

వనపర్తి,సెప్టెంబర్30(తెలంగాణ ముచ్చట్లు):

శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి  పలు గ్రామాల్లో దుర్గామాత మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
మంగళవారం  రాజపేట, ఏదుల, చెన్నారం, గోపాల్పేట, పొల్కేపహాడ్, బుద్ధారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను ఎమ్మెల్యే దర్శించి అమ్మవారిని ఆరాధించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా అన్నప్రసాదాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… “దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. గ్రామస్తుల కోరిక మేరకు ఏదుల గ్రామంలోని పురాతన ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తాను” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్పేట ఉమ్మడి మండలం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సత్యశీల రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్వతాలు, ఏదుల గ్రామ కాంగ్రెస్ నాయకులు సుఖేందర్ రెడ్డి, కొంకి వెంకటేష్, యాపర్ల రాంరెడ్డి, మధుసూదన్ గౌడ్, సురేష్ గౌడ్, సురేందర్, జానకి రాములు, రమేష్, శివన్న, అబ్దుల్లా, అచ్యుత రామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .