హసన్ పర్తి పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ కమిషనర్ 

హసన్ పర్తి పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ కమిషనర్ 

హాసన్ పర్తి, అక్టోబర్ 16(తెలంగాణ ముచ్చట్లు):

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం హసన్ పర్తి పోలీస్ స్టేషన్ ను తొలి సారిగా సందర్శించారు.ఈ సందర్బంగా కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, హసన్ పర్తి ఇన్స్ స్పెక్టర్ చేరాలు పోలీస్ కమిషనర్ కు పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ బాధితులకు పారదర్శకంగా న్యాయం అందించాలని, నీతి, నిజాయితీగా విధులు నిర్వహిస్తూ ప్రజలు అభిమానాన్ని పొందాలని పోలీస్ కమిషనర్ సూచించి స్టేషన్ పరిసరాలను పరిశీలించి స్టేషన్ పరిధిలో లోని గ్రామాలు,ఎలాంటి ఫిర్యాదులు అధికంగా నమోదవుతాయి.నేరాల నియంత్రణకై తీసుకుంటున్న చర్యలు,రౌడీ షీటర్లు,అనుమానిత వ్యక్తుల వివరాలతో పాటు స్టేషన్ అధికారులు నిర్వహిస్తున్న విధులపై అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు హన్మకొండ - కరీంనగర్ ప్రధాన రోడ్డు మార్గంలో రోడ్డు ప్రమాదాల నివారణకై తీసుకుంటున్న చర్యలపై  ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .