వినాయక మండపాలకు పోలీసు శాఖ గట్టి హెచ్చరిక.!

వినాయక మండపాలకు పోలీసు శాఖ గట్టి హెచ్చరిక.!

వేంసూరు, ఆగస్టు 22 (తెలంగాణ ముచ్చట్లు)

వినాయక చవితి వేడుకల సందర్భంగా మండపాల నిర్వహణలో నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను వేంసూరు మండలం సబ్ ఇన్స్పెక్టర్ కవిత స్పష్టంచేశారు. మండపాల నిర్మాణం, నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎస్‌.ఐ. కవిత మీడియాతో మాట్లాడుతూ, మండపం ఏర్పాటు చేసుకునే ముందు పోలీసు శాఖ రూపొందించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాలి అని చెప్పారు. మండపం ప్రైవేటు భూమిలో ఏర్పాటు చేస్తే, సంబంధిత యజమాని నుండి అభ్యంతర రహిత ధృవీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని వివరించారు.

విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖ అనుమతి తీసుకోవాలని, షార్ట్ సర్క్యూట్‌ ప్రమాదాలు రాకుండా నాణ్యమైన తీగలు, పరికరాలు మాత్రమే వాడాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి మండపంలో రెయిన్ ప్రూఫ్ టెంట్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం తప్పనిసరి అని తెలిపారు.

ప్రజా రవాణా, ఎమర్జెన్సీ వాహనాలకు ఇబ్బందులు కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, మండపాల వద్ద పశువులు, కోతులు, కుక్కలు రాకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రతి మండప కమిటీ వివరాలు, బాధ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు స్పష్టంగా ప్రదర్శించాలని అన్నారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలి. శోభాయాత్రల్లో డీజే వాడకూడదు అని కవిత స్పష్టం చేశారు. మండపాల్లో ఎల్లప్పుడూ ఒక వాలంటీర్ విధులు నిర్వర్తించేలా ఏర్పాట్లు చేయాలని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లు, వాలంటీర్లు నియమించుకోవాలని సూచించారు.

మండపాల వద్ద వెలిగించే దీపాల విషయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని, అగ్ని ప్రమాదం సంభవించినా వెంటనే చర్యలు తీసుకునేలా రెండు బకెట్ల ఇసుక, నీరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం, అసభ్యకర నృత్యాలు, ఇతర మతాలను కించపరిచే ప్రసంగాలు, పాటలు పూర్తిగా నిషేధమని చెప్పారు.

అలాగే పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు పాయింట్ బుక్లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్‌ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, వదంతులను నమ్మరాదని హెచ్చరించిన ఎస్‌.ఐ. కవిత అన్ని మండప నిర్వాహకులు నిబంధనలు కచ్చితంగా పాటించాలి. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవు అని గట్టిగా స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .