సంపూర్ణ ఆరోగ్యం.. పరీక్షలతో సాధ్యం 

కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్

సంపూర్ణ ఆరోగ్యం.. పరీక్షలతో సాధ్యం 

గౌతమ్ నగర్, సెప్టెంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):

ఆధునిక యుగంలో వేగవంతమైన జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం అత్యంత అవసరమని గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ అన్నారు. "సమయానికి పరీక్షలు చేయించుకుంటూ, వైద్యులను సంప్రదిస్తూ ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు" అని ఆమె పేర్కొన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రారంభించిన 'స్వాస్థ నారీ – సశక్తి పరివార్ అభియాన్' కార్యక్రమం కింద మల్లికార్జున నగర్ లోని ఏకలవ్య నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో రెండు రోజులపాటు ప్రత్యేక వైద్య శిబిరం మంగళవారం ప్రారంభమైంది.ఈ శిబిరంలో మహిళల కోసం విస్తృత స్థాయిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వాటిలో:విటమిన్-బి12, విటమిన్-డి పరీక్షలు,మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు,చెవి, ముక్కు, చర్మం, దంతం, గొంతు, మానసిక రుగ్మతల పై ఓరల్ సర్వే,మూత్రపోష సంబంధిత ఇన్ఫెక్షన్లు, ఫెల్విక్ ఇన్ఫ్లమేటరీ సమస్యలునెలసరి సమస్యలు, సంతాన సమస్యల పై ప్రత్యేక పరీక్షలుబుధవారం రెండవ రోజు గైనకాలజీ పరీక్షలతో పాటు మరిన్ని ముఖ్యమైన పరీక్షలు చేపడతామని వైద్యురాలు డాక్టర్ రాధా తెలిపారు.కార్పొరేటర్ సునీత రాము యాదవ్ శిబిరంలో పాల్గొని మహిళల ఆరోగ్య పరిస్థితుల ను పరిశీలించారు. "ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం సుఖసంతోషాలతో ఉంటుంది. అందుకే మహిళలు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి" అని ఆమె హితవు పలికారు.శిబిరం అనంతరం గుర్తించిన వ్యాధుల ప్రకారం ఉచితంగా మందుల ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు, పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది, నర్సులు చురుకుగా పనిచేశారు. బీఆర్ఎస్ నాయకులు మేకల రామ్ యాదవ్ సహా స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .