ప్రధానమంత్రి మోడీకి పాలాభిషేకం ఎంపీ ఈటల రాజేందర్
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)
కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సూరారం 129వ డివిజన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై ఘన సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ స్వయంగా మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయన నిర్ణయాలకు మద్దతు తెలిపారు.ఈటల మాట్లాడుతూ “జీఎస్టీ పన్ను భారం తగ్గించడం ద్వారా సాధారణ ప్రజలపై ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గింది. వ్యాపార వర్గాలు కూడా ఈ నిర్ణయంతో ఊరట పొందాయి. ప్రజల భారం తగ్గించడమే మోడీ ప్రభుత్వ లక్ష్యం” అని పేర్కొన్నారు.అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్నాయని, ప్రతి వర్గం ప్రజల ప్రగతికి మద్దతుఇస్తున్నాయని ఈటల రాజేందర్ అన్నారు
. ప్రజల సంక్షేమం కోసం తీసుకొస్తున్న విధానాలను మద్దతు ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, కార్పొరేటర్ శేషగిరి, గిరివర్ధన్ రెడ్డి, భారత్ సింహా రెడ్డి, సతీష్ సాగర్, ఎం.ఎస్. వాసు, శేఖర్ యాదవ్, పున్నారెడ్డి, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.స్థానిక వ్యాపారులు కూడా ఈ వేడుకలో పాల్గొని మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పాలాభిషేకం అనంతరం భారీగా నినాదాలు చేస్తూ వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.


Comments