పెద్దల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
అదనపు కలెక్టర్ రాధిక గుప్తా
మేడ్చల్–మల్కాజ్గిరి, నవంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం మంగళవారం మేడ్చల్–మల్కాజ్గిరి సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా వయోవృద్ధులకు శుభాకాంక్షలు తెలుపుతూ మాట్లాడారు. తల్లితండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం–2007 ప్రకారం పెద్దలకు కల్పించిన హక్కులు, రక్షణ గురించి అవగాహన కల్పించారు. వయోవృద్ధులను నిరాదరణకు గురిచేయడం లేదా సరిగ్గా చూసుకోకపోతే చట్టపరంగా జరిమానాలు, శిక్షలు తప్పవని ఆమె హెచ్చరించారు.తదుపరి జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ, పెద్దల సంక్షేమానికి ప్రతి రెవెన్యూ డివిజన్‌కు రెవెన్యూ డివిజనల్ అధికారి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. వయోవృద్ధులు ఎవరైనా నిరాదరణకు గురైనప్పుడు టోల్ ఫ్రీ నంబర్ 14567 కు కాల్ చేసి తమ సమస్యలు తెలియజేయవచ్చని సూచించారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా సంక్షేమ అధికారి శారద, సీడీపీవోలు, జిల్లా సీనియర్ సిటిజన్ల అసోసియేషన్ సభ్యులు, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ప్రతినిధులు, డీడబ్ల్యూఓ కార్యాలయం సిబ్బంది, డీపీయూ యూనిట్ సిబ్బంది, సీనియర్ సిటిజన్లు తదితరులు పాల్గొన్నారు.



Comments