అంబేద్కర్ పై అమిత్ షా చేసిన  అనుచిత వ్యాఖ్యలపై నిరసన  

-పీవీ కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన 

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన  అనుచిత వ్యాఖ్యలపై నిరసన  

-అంబేద్కర్ అభిమాన సంఘం నాయకులు ఆంగోతు మంగీలాల్ 

భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు :

భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మణుగూరు అంబేద్కర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పీవీ కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసనకారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ అభిమాన సంఘం నాయకులు ప్రముఖ బుద్ధిష్ట్ అంగోత్ మంగీలాల్ మాట్లాడుతూ ప్రపంచ మేధావి దార్శనికులు  భారత రాజ్యాంగ నిర్మాత పార్లమెంట్ వ్యవస్థకు మూల  స్తంభమైన బాబా సాహెబ్ పై కేంద్ర హోం మంత్రి అనుచిత వ్యాఖ్యల ను యావత్ దేశ ప్రజలు నిరసించాలన్నారు. దేశ అత్యున్నత హోదాలలో ఉన్న వ్యక్తులు ఇలా వ్యాఖ్యానించడం సరికాదని ఆయన  అభిప్రాయపడ్డారు ఇప్పటికైనా అమిత్ షా తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బాబాసాహెబ్ కు క్షమాపణ చెప్పాలని కోరారు. అజ్ఞానుల మదిలో జ్ఞానాన్ని ప్రసాదించాలనే ఆలోచనతో అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ మంగీలాల్, జి శ్రీనివాస్, చల్లా కాంతారావు, రామల్ల విద్యాసాగర్, ఆర్ శ్రీకాంత్, వరికెళ్ల ముత్యాలరావు, డి వంశీ, కె సాయి ప్రవర్ష, పి భార్గవ్ సాయి, ఎన్ జాషువా  సిహెచ్ పాల్, వై ఈశ్వర్, బి అభినవ్, బి వికాస్, డి యశ్వంత్, పి అశ్విత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .