సత్తుపల్లి సింగరేణిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన.!

సత్తుపల్లి సింగరేణిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన.!

 కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని హెచ్.ఓ.డి లకు వినతిపత్రం అందజేత.

- పాల్గొన్న సింగరేణి ఐక్య కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు.

సత్తుపల్లి, నవంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక సత్తుపల్లి పట్టణం సింగరేణి సంస్థ జే.వి.ఆర్ ఓసి, కిష్టారం ఓసి, జే.వి.ఆర్ సి.హెచ్.పి లలో ఐ.ఎన్.టి.యు.సి ఫిట్ సెక్రటరీలు రామారావు, బాలాజీ, నాగేశ్వరరావు ల ఆధ్వర్యంలో గని మేనేజర్లకు వినతిపత్రం ఇచ్చిన సింగరేణి ఐక్య కార్మిక సంఘాల నాయకులు.

కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్ ల వల్ల కార్మికులు అనేక ప్రయోజనాలను కోల్పోతారని తెలియజేశారు.

ప్రైవేట్ పెట్టుబడి దారులు, విదేశీ పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయకపోతే భవిష్యత్తులో కార్మికులు కార్మిక సంఘాల ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని అదేవిధంగా కార్మికులు అనేక పోరాటాల వల్ల సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కలరాస్తుందని తెలియజేశారు.

కార్మికుడు పనిగంటలు పెంపు, ఉద్యోగ భద్రత, సమ్మె చేసే హక్కును కోల్పోవడం లాంటి అనేక ప్రయోజనాలను కోల్పోతారని తెలియజేశారు.

సింగరేణి వ్యాప్తంగా నేడు జరగబోయే అన్ని ఏరియాలలో జిఎం కార్యాలయాల వద్ద జరిగే కార్యక్రమాన్ని మన సత్తుపల్లి లో కూడా పెద్ద ఎత్తున సింగరేణి కార్మిక వర్గం పాల్గొనాలని, సింగరేణి ఐక్య కార్మిక సంఘాల కార్యచరణకు ప్రతి కార్మికుడు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఐఎన్టీయూసీ బ్రాంచ్ సెక్రటరీ తీగల క్రాంతి కుమార్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సముద్రాల సుధాకర్, ఫిట్ సెక్రటరీ నరసింహారావు, సిఐటియు నాయకులు సంపత్, కార్తీక్, టీబీజీకేఎస్ నాయకులు చంద్రశేఖర్, ఐఎన్టియుసి అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీలు కోటి, సురేష్, ఐ.వి రెడ్డి వివిధ కమిటీ నాయకులు చంద్రమౌళి, రిషీశ్వరరావు, దొడ్డేపల్లి రమేష్, పొట్టి కిరణ్, రషీద్, రాము, అస్గర్ ఖాన్, సీతారామరాజు, కిషన్ రావు, నరేందర్, అశోక్, రమేష్, నజీర్, బాజీ, అఫ్రోజ్, శ్రీనివాసరావు, గోపి, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .