ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి తాత్కాలిక రద్దు
వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
Views: 10
On
వనపర్తి,అక్టోబర్4(తెలంగాణ ముచ్చట్లు):
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.జడ్పీటీసీ, ఎంపీటీసీ సహా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు, ఎన్నికల నియమావళి ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం జరగదని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి సహకరించాలని, అలాగే ఫిర్యాదులు ఇవ్వడానికి ఎవరూ కార్యాలయానికి రాకూడదని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments