రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో దర్గాలో పూజలు

రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో దర్గాలో పూజలు

 కాజీపేట తెలంగాణ ముచ్చట్లు

 కాజీపేటలో ఏర్పాటు చేస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు ఎటువంటి ఆటంకాలు జరగకుండా పనులు సకాలంలో పూర్తి కావాలని కోరుతూ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో శనివారం కాజీపేటలోని దర్గాలో పూజలు నిర్వహించారు. గత నెల 24 నుండి తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు త్వరగా పూర్తి కావాలని, అదేవిధంగా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ సర్వమత పూజలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు కాజీపేట అఫ్జల్ బీయబాని దర్గా ను సందర్శించి దర్గా పీఠాధిపతి  ఖుసుర్  పాషా  ఆశీస్సులతో దర్గాలో పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్, చైర్మన్ కొండ నర్సింగరావు కో కన్వీనర్ మహేష్,  రవీందర్, భాస్కర్ , మాధవరావు నాగేష్, రాజలింగం, వైస్ చైర్మన్లు రవీందర్, ప్రవీణ్ లక్ష్మీనారాయణ, ఉదయ, భాస్కర్, సంపత్ స్థానిక మాజీ కార్పొరేటర్ అబ్బు బక్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .