సమాజ అభివృద్ధిలో కీలకంగా ఉండాలి... పువ్వాడ 

సమాజ అభివృద్ధిలో కీలకంగా ఉండాలి... పువ్వాడ 

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

సమాజాభివృద్ధిలో కమ్మ మహాజన సంఘం కీలకంగా ఉండాలని రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.  ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన కమ్మ మహాజన సంఘం కమిటీ సభ్యులు ఆయనను శనివారం కలిశారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో  కమ్మ సంఘం సభ్యులు కీలకంగా ఉండాలని, ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా సంఘ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు. ఐక్యంగా ఉంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. రాజకీయాలకు అతీతంగా నూతనంగా ఏర్పడిన కమిటీ  పనిచేసి భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కొల్లు రఘు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చావా రాము, వైస్ ప్రెసిడెంట్ కర్ణాటి  రమాదేవి, జాయింట్ సెక్రెటరీ వజ్జా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు, కోలేటి నవీన్, మేదరమెట్ల స్వరూపరాణి, నంబూరి ప్రసాద్, పోతినేని భూమేశ్వర్ రావు, తుమ్మలపల్లి నాగేశ్వరావు, కో  అప్షన్ సభ్యులు తాళ్ళూరి మురళీకృష్ణ, బండి రవి  కుమార్, నాయకులు వల్లభనేని రామారావు, చిరుమామిళ్ల నాగేశ్వరరావు, జశ్వంత్, చీకటి వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .