ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి
కాజీపేట్ తెలంగాణ ముచ్చట్లు
కాజిపేట్ లోని డిజిల్ కాలనీ చౌరస్తాలో 47 వ డివిజన్ అధ్యక్షుడు షేక్ అజ్గర్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ సమాచార విప్లవానికి ఆధ్యుడని, దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసిన మహానీయుడని కొనియాడారు. దేశంలో కంప్యూటర్ కమ్యూనికేషన్ అభివృద్ధి చెందాయి అంటే రాజీవ్ గాంధీ చొరవఅని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ఇప్ప. శ్రీకాంత్, మైసారపు.సిరి లారెన్స్,పసునూరి. మనోహర్, దొంగల కుమార్ యాదవ్, బిలాల్, తమ్మడి మధు, దువ్వ రాజులు, కొమురవెల్లి రమేష్, కాలేశ్వరం వంశీ, ఎండి మదర్, మహేష్, శోభనమైన బిక్షపతి, మాతంగి స్వామి, సిరిపాక కుమార్, స్వామి, రేణుక, సల్లూరి నాగేశ్వరరావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Comments