రేజోనేన్స్ శ్రీనివాస నగర్ స్కూల్ లో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
ఖమ్మం శ్రీనివాస నగర్ లో గల పాఠశాలలో చాలా ఘనంగా రక్షా బంధన్ వేడుకలు ఎంతో ఉత్సాహంతో జరుపుకున్నారు. విద్యార్థిని, విద్యార్థులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఒకరికి ఒకరు రక్షా బందన్ శుభాకాంక్షలు తెలుపుతూ రాఖీలు కట్టుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల డైరెక్టర్ నాగేంద్ర కుమార్ మరియు నీలిమ మాట్లాడుతూ అన్నా చెల్లెళ్ళ మధ్య అనుభందాన్ని చాటే పండుగ రాఖీ పండుగ. రాఖి అంటే రక్షణ అని బ౦ధన్ అంటే కట్టడం అని అర్ధం అన్నా, తమ్ములు విజయం వైపు అడుగులు వెయ్యాలని ఉన్నత శిఖరాలు చేసుకోవాలని రాఖి కడుతుంది, సోదరుడు సోదరికి ఏ కష్టమైన అండగ నిలుస్తాడని హామీ ఇస్తూ తనను సంతోష పెట్టడానికి చిరు కానుకలు కూడా అందిస్తూ, అక్షింతలు చల్లుతూ ఆశీర్వదీస్తారు. అన్నంటే అమ్మ లో మొదటి సగం నాన్నలో రెండవ రెండవ సగం అన్నా న్నా చెల్లెళ్ళ అనురాగానికి గుర్తే రక్షా బంధనం అని విద్యార్థులకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని, విద్యార్థులు వేడుకను ఘనంగా జరుపుకున్నారు


Comments