స్మార్ట్ సిటి అభివృద్ధి లో భాగంగ నిదులు విడుదల
ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం
హసన్ పర్తి,తెలంగాణ మచ్చట్లు:
భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో హసన్‌పర్తి అంబేద్కర్ కాలనీలో ప్రదాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుజిడబ్ల్యుఎంసి కార్పోరేటర్ గురుమూర్తి శివకుమార్ హాజరై మాట్లాడుతూ భారత ప్రదాని నరేంద్రమోదీ దేశంలో గల గ్రామీన,పట్టణ ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా కేంద్రం నుండి హసన్‌పర్తి 66వ డివిజన్ అభివృద్ధికి 5 కోట్ల 80 లక్షల నిదులను మంజూరు చేయడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు.మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ గతంలో 66వ డివిజన్ అభివృద్ధి పనులు సీసీ రోడ్లు,సైడ్ డ్రైనేజీల నిర్మాణాలు,వీదీ లైట్ల ఏర్పాట్ల గూరించి పూర్తి నిర్మాణాత్మకమైన పనులని కేంద్రప్రభుత్వానికి తెలియజేడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా నగర మేయర్ గుండు సుధారాణి, కమీషనర్ అశ్వినీ తనాజె ఐఏఎస్,వర్దన్నపేట శాసనసభ్యుడు కే.ఆర్ నాగరాజు లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటసి పిట్టల కుమారస్వామి,భాజపా రైల్వే బోర్డు మెంబర్స్ మేకల హరిశంకర్,దాసరి రాజు, తాళ్ల రమేష్,ప్రదాన కార్యదర్శి మట్టెడ సుమన్,భాజపా హనుమకొండ జిల్లా దళిత మోర్చ కార్యదర్శి దాట్ల సునిల్,డివిజన్ కార్యదర్శి ఇమ్మడి కరుణాకర్,డివిజన్ యువమోర్చ అధ్యక్షుడు కుంభార్కర్ సాయి కిరణ్, గంట సత్యం,గంట వెంకట్ రెడ్డి,చకిలం రాజేశ్వరరావు,గరిగె మాదవి,పెద్దమ్మశ్రీనివాస్,దాదిమధుసుదన్,కందుకూరిశ్రీకాంత్,ఇమ్మడియుగేందర్(బోస్)శీలంభిక్షపతి,వెంగళశ్రీనివాస్,ఎస్.టిరాజు,పెద్దమ్మకుమారస్వామి,గోడిశాల శివకృష్ణ,నంద రవితేజ తదితరులు పాల్గొన్నారు.


Comments