మల్లాపూర్ అభివృద్ధి పనులకు నిధుల విడుదల 

ప్రజల్లో హర్షాతిరేకం

మల్లాపూర్ అభివృద్ధి పనులకు నిధుల విడుదల 

నాచారం, తెలంగాణ ముచ్చట్లు:

ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్‌లోని వివిధ ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.74 లక్షల నిధులను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర రెడ్డి సహకారంతో ఈ నిధులు మంజూరైనట్లు సమాచారం.

స్వామి వివేకానంద నగర్ కాలనీ, ఎస్సీ బస్తీ, ఓల్డ్ మల్లాపూర్ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఈ నిధులను కేటాయించారు.
ఈ సందర్భంగా మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ నేత నెమలి అనిల్ కుమార్ నేతృత్వంలో ఎస్సీ బస్తీ నివాసితులు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా సభ్యులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అభివృద్ధి పనులకు నిధులు విడుదల కావడంపై స్థానిక ప్రజానీకం హర్షం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .