ఆర్టీఐ కమిషనర్లను వెంటనే ఏర్పాటు చేయాలి
తెలంగాణ రాష్ట్ర మహిళా సంయుక్త కార్యదర్శిగా ఎర్రబెల్లి ప్రగతి
-తెలంగాణ ముచ్చట్లుహైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న వేలాది ఆర్టీఐ దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆర్టీఐ కమిషనర్లను వెంటనే నియమించాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ డిమాండ్ చేసింది.
తెలంగాణ రాష్ట్ర మహిళా సంయుక్త కార్యదర్శిగా ఎర్రబెల్లి ప్రగతిని నియమించిన సందర్భంగా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు చంటి ముదిరాజ్, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సూర స్రవంతి నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రగతి మాట్లాడుతూ, ఆర్టీఐ కమిషనర్ల లేమితో వివిధ కార్యాలయాల్లో దరఖాస్తులకు సరైన సమాధానాలు అందడం లేదని, ఆర్టీఐ చట్టం తీరుబడిని నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీఐ కార్యాలయాల్లో కమిషనర్లు లేకపోవడం వల్ల దరఖాస్తుల పరిష్కారం మరింత ఆలస్యమవుతుందని తెలిపారు.
విధాన పరిపాలనలో సమానత్వం ఉండాలంటే అన్ని శాఖలు తమ బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దరఖాస్తులపై తక్షణ స్పందనతో సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మల్లం వెంకటేశం, గుండెల రాయుడు, జి.ప్రియ రెడ్డి, బత్తుల మహేష్ గౌడ్, అంతటి అజయ్ కుమార్, ఎర్రబెల్లి రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments