ఎంపీ సహకారంతో వనపర్తి జిల్లా కేంద్రంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం 

ఎంపీ సహకారంతో వనపర్తి జిల్లా కేంద్రంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం 

-- వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘ రెడ్డి 

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి సహకారంతో వనపర్తి జిల్లా కేంద్రంలో గ్రామీణ స్వయం ఉపాధి  శిక్షణ కేంద్రం మంజూరు అయినట్టు వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి తెలిపారు. మంజూరి కోసం కృషిచేసిన  నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లురావి కి వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు . గ్రామీణ ప్రాంతాల్లోని యువత స్వయం ఉపాధిలో స్వావలంబన పొందేందుకు ప్రభుత్వం వనపర్తి జిల్లా కేంద్రంలో స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఏర్పాటుకు  అనుమతులు మంజూరు చేసినట్లు శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి  పేర్కొన్నారు. కోట్ల రూపాయల వ్యయంతో  చేపట్టే ఈ నిర్మాణానికి  యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తిస్థాయిలో సహకారం అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటుతో  నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఈ కేంద్రంలో  అందించే  ప్రత్యేక శిక్షణతో  యువకులకు వివిధ సంస్థలలో  ఉపాధి కల్పన లభిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు.ఈ శిక్షణ కేంద్రం  వనపర్తి లో ఏర్పాటు అయ్యేందుకు పూర్తిస్థాయిలో సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మినిస్టర్ దామోదర రాజనర్సింహ మరియు జిల్లా మినిస్టర్ జూపల్లి కృష్ణారావు కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .