బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన సాయి చరణ్ రెడ్డి
Views: 20
On
వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:
ఖిల్లా ఘనపూర్ మండలం, దొంతికుంట తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పత్లావత్ శ్రీను మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు సాయి చరణ్ రెడ్డి పాత్లవత్ శ్రీను అకాల మరణం పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ పార్టీకి పాత్లవత్ శ్రీను అందించిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.
శ్రీను పార్టీ కోసం చేసిన కృషిని గౌరవిస్తూ, సాయి చరణ్ రెడ్డి ఆయన కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా శ్రీను చేసిన సేవలను స్మరించుకుంటూ, వారి కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments