రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు బోనకల్ ఎం. జె .పి కళాశాల విద్యార్థి సాయికిరణ్ ఎంపిక....
-ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 7, తెలంగాణ ముచ్చట్లు;
బోనకల్ ఎం జె పి కళాశాల విద్యార్థి అయిన సాయి కిరణ్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం జరిగింది. మంగళవారం జిల్లా స్థాయిలో నిర్వహించినటువంటి కబడ్డీ పోటీల్లో చక్కని ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా జిల్లా ఆర్సిఓ రాంబాబు, ప్రిన్సిపల్ సుష్మ (డిసిఒ) మాట్లాడుతూ కళాశాల విద్యార్థి అని రంగాలలో తమ ప్రతిభతో ముందుండి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం విద్యార్థిని అభినందించారు. విద్యార్థి అభిరుచులను పరిగణలోకి తీసుకొని వారి ఆసక్తికి తగిన శిక్షణ ఇస్తున్న ఫిజికల్ డైరెక్టర్స్ అయినటువంటి పి. వెంకటేశ్వర్లు, జి.రవి ని కూడా కళాశాల యాజమాన్యం అభినందించడం జరిగింది. కళాశాల ఫిజికల్ డైరెక్టర్స్ అయినటువంటి పి. వెంకటేశ్వర్లు ,జి.రవి మాట్లాడుతూ సాయికిరణ్ క్రీడల మీద ఉన్న ఆసక్తి వలన తను తాము చెప్పిన విధంగా క్రీడల పట్ల మేలుకోవాలని నేర్చుకోవడం వల్ల నిరంతరం తను ప్రేమించడం వల్ల ఈ యొక్క విజయాన్ని సాధించగలిగాడని వారు వివరించడం జరిగింది. ఇట్టి విజయాన్ని సాధించినటువంటి సాయికిరణ్ ను కళాశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయిని బృందం కూడా అభినందించడం జరిగింది.


Comments