చీకర్ చెట్టు తండాలో ఘనంగా సంతు సేవ లాల్ జయంతి వేడుకలు 

చీకర్ చెట్టు తండాలో ఘనంగా సంతు సేవ లాల్ జయంతి వేడుకలు 

వనపర్తి,తెలంగాణ ముచ్చట్లు:

 వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చికర్ చెట్టు గ్రామంలో ఘనంగా బంజారా నాయకులు కిషన్ నాయక్ ఆధ్వర్యంలో సంతు సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంజారా నాయకులను ప్రత్యేక హోదా కింద గుర్తించి బంజారాలను ఆదుకోవాలని వారు తెలిపారు. బంజారాలకు (లంబాడీలకు) రిజర్వేషన్లతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి  సందర్భంగా ప్రతి గ్రామంలోని బంజారా నాయకులు (ప్రజలు) ఫిబ్రవరి 15వ తేదీన ఘనంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. పెద్దమందడి మండల పరిధిలోని చీకర్ చెట్టు తండా గ్రామంలో శనివారం రోజు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి  సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగిందని బంజారా నాయకుడు కిషన్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.  
ఈ కార్యక్రమంలో కిషన్ నాయక్, గోవింద్ నాయక్, రాధాకృష్ణ, హనుమంతు, బద్రు నాయక్, రెడ్యా  నాయక్, తావు నాయక్, సేవ్య నాయక్, ఖందర్ నాయక్, శీను నాయక్, ఎం గణేష్, సురేష్ నాయక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .