కీసరలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు

కీసరలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు

కీసర,ఆగస్టు18(తెలంగాణ ముచ్చట్లు):

కీసర మండలం చీర్యాల గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం రోజు వనందాస్ లక్ష్మీనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, పీడిత జనుల కోసం, బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని అర్పించిన మహాయోధుడు అని కొనియాడారు. నిరంకుశ పాలనకు ఎదురొడ్డి అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పాపన్న గౌడ్ తెలంగాణ నేలలో పుట్టడం గర్వకారణమని తెలిపారు.
అలాగే సామాజిక, రాజకీయ సమానత కోసం ఆయన చేసిన పోరాటం భావితరాలకు మార్గదర్శకమని, పాపన్న గౌడ్ వీరత్వం తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం సభ్యులు, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .