ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు
చర్లపల్లి,ఆగస్టు18(తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చక్రిపురం చౌరస్తా వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో చర్లపల్లి డివిజన్ భారతీయ జనతా పార్టీ నాయకులు టి ఆనంద్ గౌడ్, ఎం లక్ష్మణ్ గౌడ్, డి నాదం, చల్లా ప్రభాకర్, ఎం లక్ష్మీనారాయణ గౌడ్, సహదేవ్ గౌడ్ హరినాయక్, ఎస్ అశోక్, బోల్ల శ్రీనివాస్, కే విద్యాసాగర్, రత్నపురం వెంకటేష్, చక్రిపురం కాలనీ అధ్యక్షులు పాండు ముదిరాజ్, అప్పి నయీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాపన్న గౌడ్ జీవితమే సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడిస్తే సమానత్వం, న్యాయం నెలకొంటుందని అభిప్రాయపడ్డారు.


Comments