సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి  

-జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్  

సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి  

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ఆదివారం బీ.సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐ డి ఓ సి కార్యాలయం సమావేశమందిరం లో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి వేడుకలలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ , అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి పాల్గొని పాపన్న చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి అనుసరణీయమని పేర్కొన్నారు. మహనీయుల త్యాగ నిరతి నేటి తరాల వారు తెలుసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. అన్యాయాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ పోరాట తెగువ అసామాన్యమైనదని కొనియాడారు. మొఘల్ రాజుల కాలంలో దౌర్జన్యాలు, అణిచివేతలకు వ్యతిరేకంగా సమర శంఖం పూరించిన ధీశాలి సర్వాయి పాపన్న అన్నారు. పాపన్న గౌడ్ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి కుల వృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ అసమాన ధైర్య సాహసాలతో పోరాటం చేయడం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సర్వాయి పాపన్న తెగువను కొనియాడారు. సర్వాయి పాపన్నగౌడ్ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమని, ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో అందరూ సమానులేననే భావన పెంపొందేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. 

 ఈ సందర్భంగా కలెక్టర్ గౌడ కులాల వారికి తాటి బెల్లం తయారీకి, తాటి చెట్లు స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమం ద్వారా నాటుటకు, మహిళా శక్తి సంఘాల ద్వారా తాటి బెల్లం విక్రయాల గురించి మరియు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర మన పిల్లల, భావితరాల వారికి తెలియజేయాలని, కులవృత్తిని ప్రోత్సాహకంగా సాగేందుకు పలు సూచనలు చేశారు. కాటమయ్య రక్ష పథకం ద్వారా గౌడ కులస్తులకు రక్షణ కిడ్స్ అందించడం మరియు శిక్షణఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ అధికారి ఇందిర, జిల్లా పరిపాలన అధికారి గన్యా, బండి రాజుగౌడ్, అందెం గంగరాజు , కె. గౌతమ్, ఆబ్కారి శాఖ టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ, జె. రమేష్, ఆబ్కారి శాఖ ఎస్.ఐ. , పాసిని వెంకన్నగౌడ్ , బి. రవి గౌడ్ , ఇజ్జగాని రవి గౌడ్, కొదుమురి సత్యనారాయణ, బొర్రా జయమ్మ , మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .