తాటికాయలలో ఘనంగా సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు 

మహిళా ఉపాధ్యాయులను సన్మానించిన మాజీ ఎంపిటిసి ఎన్.ఎస్. చంద్రమౌళి  

తాటికాయలలో ఘనంగా సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు 

ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:

ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలోని జెడ్పిఎస్ఎస్ పాఠశాలలో సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు డి.నవీన్ కుమార్ అధ్యక్షత వహించగా, స్థానిక మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ననుబాల చంద్రమౌళి ప్రధాన అతిథిగా హాజరయ్యారు.

సమావేశ ప్రారంభంలో సావిత్రి భాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ననుబాల చంద్రమౌళి మాట్లాడుతూ, “సావిత్రి భాయి పూలే భారత దేశ చరిత్రలో మహిళల కోసం పోరాడిన తొలి సంఘ సంస్కర్త. ఆమె కేవలం ఒక ఉపాధ్యాయురాలు మాత్రమే కాకుండా, సమాజాన్ని అంధకారంలోని నాన్నావాళ్లకు వెలుగునిచ్చిన మార్గదర్శకురాలు. ఆమె మహిళా విద్య కోసం చేసిన కృషి మనందరికీ స్ఫూర్తిగా నిలవాలి” అని అన్నారు.

“ఆమె తన భర్త జ్యోతిరావు పూలే సహకారంతో మహిళలకు విద్యను అందించడమే లక్ష్యంగా పని చేశారు. మహిళలు చదువుకోవడం అనేది అప్పటి సమాజానికి కష్టతరమైన విషయం. కానీ, సావిత్రి భాయి ఆ సవాళ్లను ఎదుర్కొని, అనేక విమర్శలు తట్టుకుని, మహిళా విద్యకు బలమైన పునాదిని వేశారు. పాఠశాలలు స్థాపించడం, తల్లిదండ్రులకు వారి పిల్లల చదువు పై అవగాహన కల్పించడం ద్వారా ఆమె సమాజంలో ఒక విప్లవాన్ని తెచ్చారు” అని వివరించారు.

“సమానత్వం, హక్కులు, విద్య – ఈ మూడు అంశాలను ఆమె జీవిత లక్ష్యాలుగా తీసుకున్నారు. మహిళలు ముందుకు రావాలంటే, సమాజం మారాలంటే, ప్రతి ఒక్కరూ ఆమె ఆశయాలను అనుసరించాలి. విద్య అనేది కేవలం వ్యక్తిగత అభివృద్ధి కోసం కాదు అది సమాజానికి వెలుగునందించడానికి ఒక శక్తిగా నిలుస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

అనంతరం మహిళా ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమం నిర్వహించారు. మహిళా ఉపాధ్యాయులచే కేక్ కట్ చేయించి, వారిని శాలువాలతో సన్మానించి ఘనంగా గౌరవించారు.
ఈ వేడుకల్లో టీఎంజీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,జర్నలిస్ట్ బొల్లెపాక రాజేష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర అశోక్, ఎడ్ల వంశీ, పాఠశాల ఉపాధ్యాయులు ఉషారాణి, వసుంధర, హేమలత, రాధిక, జెన్నయ్య, రమేష్, శ్రీనివాస్, రాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.IMG-20250103-WA0026IMG-20250103-WA0024IMG-20250103-WA0028IMG-20250103-WA0022IMG-20250103-WA0030

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .