గిరిజన హక్కుల కోసం అంకితమైన శిబు సోరెన్ స్ఫూర్తిగా నిలుస్తారు
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి
Views: 5
On
జార్ఖండ్,తెలంగాణ ముచ్చట్లు:
దేశం గర్వించదగిన గిరిజన నేత, దిషోం గురు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. జార్ఖండ్ రామ్‌గఢ్ జిల్లాలోని నమ్రా గ్రామంలో సంప్రదాయ గిరిజన ఆచారాలతో నిర్వహించిన శ్రద్ధాంజలి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా శిబు సోరెన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించారు. జార్ఖండ్ మాత్రమే కాకుండా దేశంలోని గిరిజన, అణగారిన వర్గాల పక్షాన శిబు సోరెన్ బలమైన స్వరం వినిపించారని, ఆయన జీవితం ఆ వర్గాల కోసం అంకితం అయ్యిందని పేర్కొన్నారు. గిరిజన సమాజ ప్రయోజనాల కోసం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.శిబు సోరెన్
కుమారుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో పాటు కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి సంతాపాన్ని తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments