విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి.
వైరా విద్యుత్ శాఖ అధికారి సుందర్ కుమార్..
.ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:
విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైరా విద్యుత్ శాఖ అధికారి సుందర్కుమార్ సూచించారు. విద్యుత్ శాఖ ఉన్నత స్థాయి అధికారుల ఆదేశానుసారము వైరా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వైరా పట్టణంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారి సుందర్ విద్యుత్ షాక్ నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించారు. గృహములలో వస్త్రములు ఎండపెట్టుకునే, ఇతర అవసరముల నిమిత్తమై కట్టుకునే దండెములు ఇనుప తీగతో కట్టటం వలన గృహములోని విద్యుత్ వైరింగ్ తీగలు, ఫాన్లు లేక నీటి మోటర్లుషార్ట్అయినప్పుడు వాటినుంచి రిటర్న్ విద్యుత్ సరఫరా జరిగిబట్టలు ఎండవేస్తున్న ఇనుపతీగ ద్వారా షాక్ తగిలి ఎంతోమంది మృత్యువాత పడటం జరుగుతున్నది.
ఇట్టి సంఘటనలను నివారించుటకు వినియోగదారులకు, ప్రజలకు అవగాన కల్పించి ఇనుపతీగ దండెము స్థానంలో ప్లాస్టిక్ లేక నైలాన్ వైరును దండెము గా కట్టుట వలన ప్రయోజనములపై అవగాహన చైతన్య పరిచారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్ శ్రీనివాసరావు, కృష్ణయ్య, భద్రం, ప్రజలు పాల్గొన్నారు.


Comments