రాంపల్లిలో వైభవంగా శ్రీ దేవీ దసరా శరన్నవరాత్రుల పూజలు
నాగారం, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)
రాంపల్లి శ్రీ మహంకాళి దేవాలయం లో 33వ శ్రీ దేవీ దసరా శరన్నవరాత్రుల పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో శ్రీ మహంకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.మొదటి రోజు పూజా కార్యక్రమాల్లో శ్రీ గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ పూజ, కలశ స్థాపనతో పాటు ప్రత్యేక అలంకరణ పూజలు నిర్వహించారు. గ్రామ పురోహితులు ప్రధాన అర్చకులు గొంగులూరి రాం మూర్తి శర్మ, గణపురం రాంప్రసాద్ శర్మ, గణపురం శ్యామ్ సుందర్ శర్మలచే పూజలు జరిగాయి.
దుర్గా భవాని మాత విగ్రహ దాత జమ్మల ప్రశాంత్ గౌడ్ దంపతులు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోగా, అనంతరం హైటెక్ డెవలపర్స్ శ్రీ బొడిగం కోటిరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.కీసర సీఐ ఆంజనేయులు, ఎస్సై హరిప్రసాద్ అమ్మవారిని దర్శించుకోగా, ఆలయ కమిటీ చైర్మన్ ఎలసాని భూమయ్య యాదవ్ మరియు కమిటీ సభ్యులు వీరికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదం అందజేశారు.ఈ వేడుకల్లో కమిటీ ఉపాధ్యక్షుడు మహేందర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, కోశాధికారి ఎల్లమయ్య, సభ్యులు మహేందర్ రెడ్డి, ఓం ప్రకాష్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, సోమిరెడ్డి, బాలనరసింహ, శ్రీశైలం, శివరాజ్ యాదవ్, కుమార్, గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు, యువజన సంఘాల యువకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Comments