కార్యకర్తల కుటుంబాలకు అండగా సింగపురం ఇందిర
స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు:
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సింగపురం ఇందిర కార్యకర్తలకు ఆపదలో అండగా నిలుస్తూ, వారి కుటుంబాలకు భరోసా కల్పించే నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గంలో తనను నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు ఆర్థికపరంగా లేదా అవసరమైన ఇతర సహాయం అందజేసి, వారి బాధలను తలచుకుంటూ మానవతా విలువలతో ముందుకు సాగుతున్నారు.
చిల్పూరు మండలం నష్కల్ గ్రామంలో గ్రామశాఖ ఉపాధ్యక్షుడు పాశం రఘు తండ్రి జాన్ ఇటీవల మరణించడంతో, సింగపురం ఇందిర ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కుటుంబాన్ని పరామర్శించి, 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.
ఇందిర నాయకత్వం ద్వారా “పార్టీ కార్యకర్తల కుటుంబాలు మా కుటుంబాల్లాంటివి. ఎప్పటికీ వారి వెన్నునోటుగా ఉంటాం” అనే సందేశం కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంచుతోందని నియోజకవర్గ ప్రజలు ప్రశంసిస్తున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు కూరపాటి సాంబయ్య, పాశం ఆరోగ్యం, శాగంటి మణి, మోడెం రాంబాబు, మొగిలి, రాజు తదితరులు పాల్గొన్నారు.


Comments