శ్రీ చైతన్యలో సోషల్ వీక్ వేడుకలు ఘనంగా
విభిన్న రాష్ట్రాల వేషధారణలతో సందడి.
సత్తుపల్లి, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక విద్యాలయం శ్రీ చైతన్య కరికులమ్ ప్రైమరీ విభాగంలో భాగంగా నిర్వహించిన సోషల్ వీక్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు జరిగిన “ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా – యూనిటీ అండ్ డైవర్సిటీ” కార్యక్రమం రంగుల హరివిల్లులా సాగింది.
విభిన్న రాష్ట్రాల సంప్రదాయ వేషధారణలో చిన్నారులు అలరించారు. దేశ వైవిధ్యాన్ని ప్రతిబింబించే నృత్యాలు, వేష ప్రదర్శనలతో సందడి చేశారు. ప్రేక్షకులను చిన్నారుల ప్రతిభ ముగ్ధులను చేసింది.
ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్లు శ్రీధర్, శ్రీవిద్య మాట్లాడుతూ, సోషల్ వీక్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో భారత సంస్కృతి, ఐక్యత, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడంలో కీలకమని పేర్కొన్నారు. చిన్నారుల పాల్గొనడం, ప్రతిభపై వారు ప్రశంసలు కురిపించారు.
కార్యక్రమంలో జోనల్ కోఆర్డినేటర్ పార్వతి, ప్రిన్సిపాల్ నాగరాజు, వైస్ ప్రిన్సిపాల్ అజితతో పాటు ఉపాధ్యాయినీ-ఉపాధ్యాయులు పాల్గొని చిన్నారులను అభినందించారు.


Comments