మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించండి.

కలెక్టర్ కు ఏఐటియుసి వినతి

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించండి.

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ అధ్వర్యంలో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. 20 ఏళ్లుగా మధ్యాహ్న భోజన కార్మికుల నుంచి ప్రభుత్వం శ్రమ దోపిడీకి పాల్పడుతుందని ఆరోపించారు. అతి తక్కువ వేతనంతో పనిచేసే కార్మికులు ఎవరైనా ఉంటే వారు ముధ్యాహ్న భోజన కార్మికులేనని వినతి పత్రంలో పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ కార్మికుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కోరారు. కనీస వేతనం క్రింద రూ. 26వేలు చెల్లించడంతోపాటు పెండింగ్లో ఉన్న మెనూ ఛార్జీలను, కౌడిగుడ్ల బిల్లులు, అల్పాహార విల్లులు, గౌరవ నేతనాన్ని విడుదల చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఏడు నెలలుగా వేతనం పెండింగ్లో పెట్టారని వారు కలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేలు ఇవ్వాలని వినతి పత్రంలో కోరాడు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని కోదాడు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గాది లక్ష్మి నారాయణ, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు నిమ్మటూరి రామకృష్ణ, ఇజ్జగాని వెంకటమ్మ, ఒక్కంపూడి వెంకటలక్ష్మి, రాజ్యలక్ష్మి. ఆరోమణి, సీత, పార్వతమ్మ, వెంకట్రామ్మ, కిరోమణి, భారతి, వరలక్ష్మి, రంగమ్మ, కనకమ్మ, తిరపతమ్మ తదితరులు ఉన్నారు. వినతి పత్రానికి ముందు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .