తల్లిదండ్రులకు షష్టిపూర్తి వేడుక నిర్వహించిన కొడుకు , కూతుళ్లు
తల్లిదండ్రులకు షష్టిపూర్తి నిర్వహించడం వల్ల వారి శ్రమను గౌరవించవచ్చు, వారికి విశ్రాంతినివవచ్చు
జీవితంలో సగం వయసు గడిచే ఘట్టం చాలా ముఖ్యమైనది
-- వెల్టూర్ పెద్ద శ్రీనివాస్ రెడ్డి, అనసూయ, విపుల
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన భారత మాజీ సైనికుడు రంగాపురం చిన్నారెడ్డి, యశోదమ్మ దంపతులకు కొడుకు పెద్ద శ్రీనివాస్ రెడ్డి, కూతుళ్లు అనసూయ, విపుల తల్లిదండ్రులకు షష్టిపూర్తి వేడుకలు నిర్వహించారు. మంగళవారం వెల్టూర్ గ్రామంలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులకుతో, బంధుమిత్రుల సమక్షంలో తల్లిదండ్రులకు షష్టిపూర్తి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కోట్ల రూపాయలు సంపాదించి తల్లిదండ్రులను అనాధ ఆశ్రమంలో చేరుస్తున్న ఈ రోజుల్లో... వెల్టూర్ పెద్ద శ్రీనివాస్ రెడ్డి, అనసూయ, విపుల సాధారణ కుటుంబంలో జన్మించి తల్లిదండ్రులకు షష్టిపూర్తి నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. తల్లిదండ్రులకు షష్టిపూర్తి నిర్వహించి తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని స్వీకరించారు. ఈ షష్టిపూర్తి కార్యక్రమాన్ని కుమారుడు శ్రీనివాస్ రెడ్డి, విజయలక్ష్మి (కోడలు), కూతుళ్లు అనసూయ, విపుల, యశోదమ్మ సోదరులు జనార్దన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి లు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని రంగపురం చిన్నారెడ్డి దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Comments