రహదారిపై స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలి
-- జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
--చీకరు చెట్టు తాండ యువకులు
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా కేంద్రం నుండి ఖిల్లా ఘణపుర్ వెళ్లే రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని చీకరు చెట్టు తండాకు చెందిన కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. పామిరెడ్డిపల్లి, చీకరు చెట్టు తండా, వీరాయిపల్లి గ్రామాల దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గతంలో ఆర్ అండ్ బి అధికారులకు విన్నవించుకున్న స్పందించలేదని జిల్లా కలెక్టర్ కు ఈరోజు వినతిపత్రం అందజేయడం జరిగిందని వారు తెలిపారు. బుధవారం పామిరెడ్డిపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. పామిరెడ్డిపల్లి గ్రామస్తులు కూడా గ్రామం దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పామీరెడ్డి పల్లి గ్రామం దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ఉంటే నిన్న ప్రమాదం జరిగి ఉండేది కాదని, ప్రాణాలతో యువకులు బయటపడే వారని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రహదారి పై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను కొంత మేర నివారించవచ్చని యువకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పెద్దమందడి మండలంలో చాలా గ్రామాలలో రహదారిపై మలుపు దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామాలలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా నాయక్, రమేష్ నాయక్, దేవా నాయక్, సురేష్ నాయక్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.


Comments