తెలంగాణ మణిహారం ట్రిపుల్ ఆర్ భూసేకరణను వేగవంతం చేయండి
ట్రిపుల్ ఆర్ భూసేకరణపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
Views: 36
On
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ మణిహారంగా పేరుగాంచిన రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్ )నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఆర్ఆర్ఆర్, ఆర్ అండ్ బీ, జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు.
అటవీ శాఖ పరిధిలో ఉన్న అడ్డంకులను వెంటనే పరిష్కరించాలని, ఇందుకోసం అటవీ మరియు ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టంగా తెలిపారు. రెండు శాఖల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.
నాగ్‌పూర్-విజయవాడ కారిడార్:ఈ కారిడార్‌కు సంబంధించిన తెలంగాణ జిల్లాల్లో అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను సంక్రాంతి నాటికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
-గ్రామాలకు బీటీ రోడ్లు:
రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రాలకు బీటీ రోడ్లు నిర్మాణం తప్పనిసరిగా ఉండాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీలైనంత వెడల్పుతో డిజైన్ చేయాలని పేర్కొన్నారు. ఇందుకు విడతల వారీగా నిధులు విడుదల చేయాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ధనసరి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments