సింగరేణి దినోత్సవ వేడుకల సందర్భంగా సత్తుపల్లిలో మహిళలకు ఆటల పోటీలు
Views: 33
On
సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
సింగరేణి దినోత్సవ వేడుకలు-2024 పురస్కరించుకొని సత్తుపల్లిలో మహిళల కోసం ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించారు. లేడీస్ క్లబ్ సభ్యులకు సత్తుపల్లి గెస్ట్ హౌస్‌లో, ఉద్యోగస్తుల గృహిణులకు పివి నరసింహారావు కాలనీలో ఈ పోటీలు నిర్వహించారు.
పోటీల్లో విజేతలకు డిసెంబర్ 23 సోమవారం ప్రగతి వనంలో జరగనున్న సింగరేణి దినోత్సవ వేడుకల సందర్భంగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో ఎక్కువ మంది పాల్గొనాలని వారు ఆహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో ఉష ప్రహ్లాద్, చాముండేశ్వరి నరసింహారావు, విజయ సోమశేఖర్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే, సీనియర్ పీఓ జె.వి.ఆర్. ఓ.సి.కే దేవదాస్ కాలనీకి చెందిన ఉద్యోగస్తుల గృహిణులు కూడా పాల్గొనడం విశేషం.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments