కాప్రా నాయక్ నగర్ బంజారా కాలనీలో శ్రీ దేవీ శరన్నవరాత్రుల ఘనారంభం

కాప్రా నాయక్ నగర్ బంజారా కాలనీలో శ్రీ దేవీ శరన్నవరాత్రుల ఘనారంభం

కాప్రా, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విఠల్ నాయక్ దంపతులు కాప్రా నాయక్ నగర్ బంజారా కాలనీలోని భవాని మాత మండపంలో జరిగిన శ్రీ దేవీ శరన్నవరాత్రుల మొదటి రోజు పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ – ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో శ్రీదేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, భవానీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్థానికులతో కలిసి పూజలు చేస్తున్నామని తెలిపారు.మొదటి రోజు అమ్మవారి ని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించామని, ప్రతి రోజూ అమ్మవారిని వేర్వేరు అవతారాలలో అలంకరించి భక్తులకు దర్శనమిస్తారని ఆయన వివరించారు.కాప్రా పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించామని విఠల్ నాయక్ తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయక్ నగర్ బంజారా కాలనీ వాసులు, భవాని మాత మాలదారులు, భక్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .