ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

నాచారం,తెలంగాణ ముచ్చట్లు:

నాచారం నారాయణ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శోభాయమానంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ, యశోద వేషధారణలో పాల్గొని ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా ఉట్టి పగులకొట్టే కార్యక్రమం సందడి రేపింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల జీఎం గోపాల్ రెడ్డి, ఎజీఎం బాల పరమేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి వేడుకల ద్వారా విద్యార్థులకు సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగల విశిష్టత గురించి అవగాహన కలుగుతుందని అన్నారు.

ఈ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపాల్ పర్వీన్, ఈ-చాంప్స్ కోఆర్డినేటర్ లక్ష్మీ భవాని, ఈ-కిడ్జ్ కోఆర్డినేటర్ నూర్, ఈ-చాంప్స్ వైస్ ప్రిన్సిపాల్ సరిత, ఈ-కిడ్జ్ వైస్ ప్రిన్సిపాల్ షాహీన్, ఏఓ మహేందర్, పీఈటీ నరేష్ తో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .